లవ్వర్ ముందే వస్తాడట 


టాలీవుడ్ సంచలనం విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’గా మారిన సంగతి తెలిసిందే. కాంత్రి మాధవ్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవ్వర్’. రాశీఖన్నా కథానాయిక. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ సినిమా ప్రపంచ ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న విడుదల చేద్దామని భావించారు. కానీ అంతకంటే ముందే లవ్వర్ రాబోతున్నట్టు సమాచారమ్.

అనుకొన్న సమయానికంటే చాలా ముందుగానే వరల్డ్ ఫేమస్ లవ్వర్ షూటింగ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 20కి ఫిక్సయినట్టు సమాచారమ్. అదే రోజు బాలయ్య 102 ‘రూలర్’, సాయి తేజ్ ‘ప్రతిరోజు పండగే’ సినిమా రాబోన్నాయి. వీరితో విజయ్ దేవరకొండ పోటీకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. 

ఇక క్రాంతి మాధవన్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సినిమా ఉండనుంది. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపించబోతున్నారు. ఫైటర్ టైటిల్ అనుకొంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఆగిపోయిందనుకొన్న విజయ్ దేవరకొండ హీరో సినిమా కూడా తిరిగి పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో విజయ్ బైక్ రేసర్ గా కనిపించబోతున్నాడు.