అట్లీపై తారక్ ప్రశంసలు

తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ఉండనుందనే వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ప్రసుతం తారక్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. వచ్చే యేడాది జులై 30న ‘ఆర్ఆర్ఆర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటి వరకు తారక్ మరో సినిమా ఛాన్సే లేదు. ఆ తర్వాత మాత్రం తారక్ తో సినిమా చేయబోతున్న దర్శక లిస్టులో కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాటు అట్లీ పేరు గట్టిగా వినిపిస్తున్నాయ్. ఐతే, ఇప్పటికే అట్లీతో తారక్ టచ్ లో ఉన్నారట. 

ఈ విషయాన్ని స్వయంగా అట్లీనే తెలిపారు. ఆయన తాజా చిత్రం ‘బిగిల్’. విజయ్-అట్లీ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రమిది. తెలుగులో ‘విజిల్’గా రాబోతుంది. ఈ వారమే (అక్టోబర్ 25) రిలీజ్. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న అట్లీ తారక్ తో ఉన్న అనుబంధం గురించి తెలిపారు. తన సినిమా రిలీజైన ప్రతిసారి తారక్ ఫోన్ చేసి.. అభినందిస్తారు. దాంతో.. నాకు చాలా ఆనందంగా ఉంటుందని అన్నారు. అంతేకాదు.. త్వరలోనే తారక్ తో సినిమా చేస్తానని అట్లీ అన్నారు.

 ఇక, మహిళల ఫుట్‌బాల్ క్రీడా నేపథ్యంలో ‘విజిల్’ తెరకెక్కింది. అసలు ‘విజిల్‌’ కథను రాయడానికి కారణం ప్రస్తుతం సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులే కారణం. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను చూసి బాధతో ‘విజిల్‌’ కథను రాసుకొనా.  మహిళా ప్రధానంగా సాగే సినిమాలో విజయ్‌లాంటి సూపర్‌స్టార్ నటించడం చాలా ఆనందంగా ఉంది’ అన్నారు అట్లీ. అంతేకాదు.. ఈ సినిమా మహిళలకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు.