ఆ కేసుల్లో పోలీసుల జోక్యంపై హైకోర్టు సీరియస్..
సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యంపై హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సివిల్వివాదంలో బంజారాహిల్స్ పోలీసులు బలవంతంగా సంతకాలు సేకరించారని హైకోర్టులో ఓ మహిళా పిటిషన్ దాఖలు చేసింది. గతంలో ఎన్నో సార్లు ఇలాంటి పిటిషన్లు దాఖలైన సమయంలో సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యం ఉండకూడదని హైకోర్టు చెప్పింది. పలు మార్లు ఇదే రిపీట్ అయినా పోలీసుల వ్యవహారశైలిలో మార్పు రాకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చ చేసింది.
సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా అని హైకోర్ట్ ప్రశ్నించింది. అంతేకాకుండా బంజారాహిల్స్ ఎస్ హెచ్ వో, ఎస్సై హరిందర్ ఈనెల 12న తమ ఎదుట హాజరుకావాలని హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మహిళ ఆరోపణలపై ఏసీపీ స్థాయి అధికారితో ఎంక్వైరీ చేయాలని హైదరాబాద్ సీపీకి ఆదేశించింది కోర్టు.