దీపావళికి రాములమ్మ లుక్ 


సంక్రాంతి సినిమాలు అభిమానులకి దీపావళి కానుకలు అందించబోతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి దీపావళి కానుక రానుంది. రెడీగా ఉండండని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. ఇప్పుడా గిఫ్ట్ కోసం ప్రిన్స్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో మ‌హేష్ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఆయనకి జంటగా ర‌ష్మిక మందన నటిస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇక దీపావళీకి కానుకగా సరిలేరు నుంచి రాములమ్మ లుక్ రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఆమెతో పాటు మహేష్ టపాసులు కాల్చే పోస్టర్ ని వదులుతారని తెలుస్తోంది. ఇదే నిజమైతే.. మహేష్ ఫ్యాన్స్ కి పండగే.
  
ఇక సంక్రాంతికి రాబోతున్న మరో సినిమా అల.. వైకుంఠపురంలో. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న హ్యాట్రిక్ చిత్రమిది. ఈ సినిమా కూడా సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి దీపావళీ కానుకగా ‘రాములో రాముల’ సాంగ్ రాబోతుంది. ఇప్పటికే వచ్చిన సాంగ్ టీజర్ అదిరిపోయింది. ఫుల్ సాంగ్ రచ్చ చేసేలా ఉంది.