హుజూర్ నగర్ ఉప ఎన్నిక : తెరాస అభ్యర్థి సైదిరెడ్డి రికార్డ్ విజయం

హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెరాస అభ్యర్థి సైదిరెడ్ది ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతిపై 43,233 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తొలి రౌండ్ నుంచే సైదిరెడ్డి ఆధిక్యంలో దూసుకెళ్లారు. రౌండ్ రౌండ్ కి ఆధిక్యం పెరుగుతూ వెళ్లింది. మొత్తం 22 రౌండ్లు పూర్తయ్యే వరకు 43,233 ఓట్ల మెజారిటీని సాధించారు. ఇంతటి భారీ మెజారిటీతో గెలుపొందడం హుజూర్ నగర్ లో రికార్డ్. స్థానం నుంచి 2009 కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి 29,194 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇప్పటి వరకు అక్కడ ఇదే రికార్డ్ మెజారిటీ. ఇప్పుడీ రికార్డ్ ని సైది రెడ్డి బ్రేక్ చేశారు.

ఇక హుజూర్ నగర్ ఉప ఎన్నికలో పార్టీల వారీగా పోలైన ఓట్లని చూస్తే.. తెరాసకు 1,12,796 ఓట్లు, కాంగ్రెస్ కు 69,563 ఓట్లు,
ఇండిపెండెంట్ సుమన్ కు 2308 ఓట్లు, బీజేపీకి 2,247 ఓట్లు, టీడీపీకి 1597 ఓట్లు పోల్ అయ్యాయి. టిడిపి అభ్యర్ధి కిరణ్మయి, బిజెపి అభ్యర్ధి రామారావులతో పాటు ఇక్కడ పోటీ చేసిన మరో 23 మంది స్వతంత్రులు డిపాజిట్స్ పొగొట్టుకున్నారు.. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన సుమన్ కు మూడో స్థానం రాగా, నాలుగో స్థానంలో బిజెపి, అయిదో స్థానంలో టిడిపి నిలిచాయి.