ఈ నెల 26న హుజూర్ నగర్’లో సీఎం కేసీఆర్ సభ
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో తెరాస ఘన విజయం నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా హుజూర్ నగర్ ప్రజలకి ధన్యవాదాలు తెలిపారు. తెరాసపై హుజూర్ నగర్ ప్రజలు పెట్టుకున్న ఆశయాలను నెరవేరుస్తామన్నారు. అంతేకాదు.. ఈ నెల 26న హుజూర్ నగర్‌కు వెళ్లి ప్రజలని పలుకరిస్తానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన సభ జరగకపోయినా.. భారీ గెలుపు దక్కడంపై సీఎం కేసీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే ఈ నెల 26న హుజూర్ నగర్ లో సీఎం సభ నిర్వహించబోతున్నారు. అంతేకాదు.. ఈ వేదికపై నుంచి హుజూర్ నియోజవర్గానికి వరాలు గుప్పించనున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం స్పష్టమైన హామీలు ఇవ్వడంతో పాటు.. ఆ పనుల కోసం అయ్యే ఖర్చులని వేదికపై నుంచే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి.. హుజూర్ నగర్ ఉప ఎన్నిక కొద్దిరోజులపై ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాలని, ఆర్టీసీ సమ్మె విషయంలో ప్రభుత్వంపై ప్రజలకి వ్యతిరేక లేదనే విషయం స్పష్టమైందని సీఎం హ్యాపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు, ఆర్టీసీ సమ్మెపై మరోసారి తనదైన శైలిలో స్పందిచారు సీఎం కేసీఆర్.