థియేటర్స్’పై విజయ్ అభిమానుల దాడి !


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించిన చిత్రం ‘బిగిల్’. తెలుగులో ‘విజిల్’గా దీపావళీ కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఐతే, చెన్నైలో బిగిల్ ప్రీ వ్యూలు పడలేదు. దీంతో తమ అభిమాన హీరో సినిమా ప్రీవ్యూలని అడ్డుకుంటారా అంటూ.. విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోయారు. థియేటర్స్ పై దాడికి దిగారు. దీంతో చెన్నైలోని కొన్ని థియేటర్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది.

అట్లీ-విజయ్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం విజిల్. మహిళా ఫుట్‌బాల్‌ కథాంశంతో తెరకెక్కిన విజిల్ కు పాజిటివ్ టాక్ నడుతోంది. సినిమా అద్భుతంగా ఉంది. అట్లీ మరోసారి తన మార్క్ చూపించారు. సినిమాలో మాస్, ఎమోషన్, యాక్షన్ హైలైట్ గా నిలిచాయని చెబుతున్నారు. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో విజయ్ ఒదిగిపోయారు. బిగిల్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెబుతున్నారు. ఇక విజిల్ ప్రివ్యూ షోస్ క్యాన్సిల్ అయినా.. మొదటి ఆటతోనే సినిమా చూసి విజయ్ అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు.