తిరిగి విధుల్లోకి ఆర్టీసీ కార్మికులు !
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని నిన్నటి సీఎం కేసీఆర్ మీడియా సమావేశంతో మరోసారి స్పష్టమైంది. ఆర్టీసీ మునుగుడు కాదు. ముగిసిపోనుందని తీవ్ర హెచ్చరికలు చేశారు సీఎం కేసీఆర్. అదే సమయంలో తెలివైన ఆర్టీసీ ఉద్యోగులైతే… తిరిగి ఉద్యోగంలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ నేపథ్యంలో చాలామంది ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారమ్.
మరోవైపు, సీఎం కేసీఆర్ బెదిరింపులకి భయపడేది లేదు. సమ్మెని మరింత ఉదృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వర్థామ రెడ్డి అన్నారు. భవిష్యత్ కార్యచరణపై ఇవాళ సమావేశం కానున్నారు. ప్రతిపక్షాలు కూడా ఆర్టీసీ సమ్మెపై భవిష్యత్ కార్యచరణపై ఇవాళ సమావేశాలు, చర్చలు నిర్వహించనుంది. ఈ రెండు సమావేశాల అనంతరం విధుల్లో చేరే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చాలామంది ఆర్టీసీ కార్మికులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందరు కాకపోయినా.. కొందమంది ఒకట్రెండు రోజుల్లో తిరిగి ఉద్యోగాల్లో చేరబోతున్నట్టు అర్థమవుతోంది. అదే జరిగితే.. ఆర్టీసీ సమ్మె ఉదృతి తగ్గినట్టే. సమ్మె విషయంలో ప్రభుత్వం వ్యూహాం ఫలించినట్టే.