ఇస్మార్ట్ శంకర్ @100డేస్

పూరి దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన చిత్రం ఇస్మార్ట్ శంకర్. నిధి అగర్వాల్, నభా నటాషా హీరోయిన్. జులై 18న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వరుస ప్లాప్ ల్లో ఉన్న పూరి, రామ్ లకి లైఫ్ ఇచ్చిన సినిమా ఇది. నభా నటాషాని వెలుగులోకి తీసుకొచ్చిన చిత్రమిది. చాన్నాళ్ల తర్వాత మాస్ ప్రేక్షకులకి వింధుభోజనం పెట్టిన సినిమా ఇది. 

అందుకే టాలీవుడ్ లో ఇస్మార్ట్ శంకర్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడీ సినిమా వందరోజులని పూర్తి చేసుకొంది. ఈ సందర్భంగా చిత్రబృందం 100డేస్ పోస్టర్ విడుదల చేసింది. ఇందులో రామ్ తనదైన శైలిలో గర్జించడం చూడొచ్చు. ఇక ఇస్మార్ట్ విజయంతో రామ్ తన తదుపరి సినిమాని తిరుమల కిషోర్ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నారు. వీరి కలయికలో రాబోతున్న హ్యాట్రిక్ చిత్రమిది. గతంలో వీరి కాంబోలో వచ్చిన నేను శైలజ, ఉన్నదీ ఒక్కటే జీవితం సినిమాలు ఆకట్టుకొన్నాయి.

ఇక ఇస్మార్ట్ విజయంతో హిట్ ట్రాక్ లోకి వచ్చిన పూరి జగన్నాథ్ తన తదుపరి సినిమాని టాలీవుడ్ సంచలనం విజయ్ దేవవరకొండతో ఉండనుంది. ఇందులో విజయ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఫైటర్ టైటిల్ పరిశీలనలో ఉంది. హీరోయిన్ గా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్, మలయాళ నటి ప్రియ వారియర్ పేర్లు వినిపిస్తున్నాయ్.