‘పవనిజం’ని ప్రశ్నించిన ఏపీ మంత్రి !


తెదేపాతో లాలూచీ.. జగన్ తో పేచీనే పవనిజం అంటారా ? అని మంత్రి షేర్ని నాని ప్రశ్నించారు. సీఎం జగన్ పై కేసులున్నాయన్న పవన్ కి నాని కౌంటర్ ఇచ్చారు. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాన్ని ప్రశ్నించడం ఏంటి ? తెదేపాకు వంత పాడటాన్ని ఎలా చూడాలి ? అని దుయ్యబట్టారు. తనపై ఎలాంటి కేసుల్లేని పవన్ భాజపాను ఇప్పటి వరకు ప్రశ్నించారా నాని నిలదీశారు.లాలూచీ పడకుండా నిజాయతీ రాజకీయాలు చేయాలని పవన్ కు పేర్ని నాని హితవు పలికారు.

2014లో ఏపీలో తెదేపా అధికారంలోకి రావడానికి పవన్ నే ప్రధాన కారణం. జనసేన మద్దతుతోనే ఏపీలో తెదేపా అధికారంలోకి వచ్చింది. ఐతే, పవన్ కొన్ని ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. కానీ ప్రభుత్వాన్ని ఏ విషయంలో, ఏనాడు గట్టిగా నిలదీయలేదు. ఇక ఎన్నికల ముందు తెదేపాతో కలిసి పోటీ చేయలేదు. కానీ, స్నేహపూర్వక సర్థుబాటులా వెళ్లాయి తెదేపా, జనసేన. ఈనేపథ్యంలో తెదేపాతో పాటు జనసేనని ఏపీ ప్రజలు పూర్తిగా తిరస్కరించారు. వైకాపాకి ఘన విజయాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు కూడా పవన్ తెదేపా గొంతుని వినిపించడం చర్చనీయాంశం అయింది. పవన్ తనదైన మార్క్ జనసేన రాజకీయం ఎప్పుడు చేస్తారా ? చూడాలని ఉందని చాలా మంది వెయిట్ చేస్తున్నారు.