లేడీ సూపర్ స్టార్.. సరిలేరు నీకెవ్వరు !

మెగాస్టార్ చిరంజీవి దాదాపు పదేళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇచ్చినా.. ఆయన క్రేజ్, ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని ‘ఖైదీ నెం.150’తో రుజువైంది. అప్పుడు, ఇప్పుడు.. ఎప్పుడూ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవినే ప్రేక్షకులు తీర్పునిచ్చారు. ఖైదీ నెం.150 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది. ఇప్పుడు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 13యేళ్ల తర్వాత ఆమె నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలో భారతి (విజయశాంతి)లుక్ ని దీపావళీ కానుకగా రిలీజ్ చేశారు. ఆ లుక్.. లేడీ సూపర్ స్టార్ విజయశాంతికి ఇంకెవ్వరు సరిలేరు అన్నట్టుగా ఉంది. అద్భుతంగా ఉంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న చిత్రమిది. రష్మిక మందన కథానాయిక. ఇందులో విజయశాంతి పాత్ర అద్భుతంగా ఉండనుంది. మహేష్ పాత్రతో సమానంగా విజయశాంతి పాత్రని దర్శకుడి మలిచాడని చెబుతున్నారు. ఫస్ట్ లుక్ లో మాత్రం విజయశాంతి సీరియస్ మూడ్ లోనే ఉన్నారు. దీంతో.. ఆమె సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నట్టు అర్థమవుతోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు-అనిల్ సుంకర్-మహేశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న సరిలేరు నీకెవ్వరు ప్రేక్షకుల ముందుకు రానుంది.