రకుల్ ఐటమ్ పోస్టర్ చూశారా ?


టాలీవుడ్, కోలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ అనిపించుకొంది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. అక్కడ ‘దే దే ప్యార్ దే’తో హిట్ కొట్టింది. ఆమె నటిస్తున్న తాజా బాలీవుడ్ చిత్రం ‘మర్జవాన్’. ఈ చిత్రానికి మిలాప్ జెవేరి దర్శకత్వం వహిస్తున్నారు. రితీష్ దేశ్ ముఖ్, సిద్ధార్థ్ మల్హోత్రా, తార సుతారియా, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 15న ‘మర్జవాన్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ని మొదలెట్టారు. ఓ పాటను రిలీజ్ చేయనున్నారు. 

ఇది ప్రత్యేకించి రకుల్ పై ఫోకస్ చేసిన స్పెషల్ సాంగ్. ‘సబ్ కి జాన్ లేనే ఔర్ జాన్ బాన్ నే.. ఆ రహి హై హర్ దిల్ కి ఆర్జూ… ఆర్జూ..! హైయా హో..!!’ అంటూ సాగే ఈ పాటను రిలీజ్ చేయనున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇదో ఐటమ్ నెంబర్. సాంగ్ రిలీజ్ కి సంబంధించిన పోస్టర్ ని రకుల్ ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసింది. ఈ పోస్టర్ లో రకుల్ చాలా హాట్ గానే ఉంది. ఐటమ్ గా రకుల్ బాలీవుడ్ ప్రేక్షకులని ఏ మేరకు బుట్టలో వేసుకుంటుంది అనేది చూడాలి.