ప్రేమకథపై దిల్ రాజు మౌనం వెనక !


ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి – త్రిష జంటగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం ’96’. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ దశాబ్ధకాలంలో వచ్చిన ఉత్తమ ప్రేమకథా చిత్రంగా కితాబందుకొంది. ఎంతో ఇష్టంగా ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ ని దిల్ రాజు తీసుకొన్నారు. మాతృక దర్శకుడినే తీసుకొచ్చి, శర్వానంద్‌-సమంత కాంబినేషన్‌లో ఈ చిత్రాన్ని మొదలుపెట్టాడు. జెడ్ స్పీడుతో షూటింగ్ జరుపుకుంటోంది. అనుకుంటే నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ లో సినిమా రిలీజ్ చేయొచ్చు.
 
కానీ, 96 విషయంలో దిల్ రాజు సలైంట్ గా ఉంటున్నారు. డిసెంబర్‌ 20 లేదా 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నా.. వీలుపడదు. ఆ డేటు మూడ్నాలుగు సినిమాలు వస్తున్నాయి. సంక్రాంతికి అనుకొన్నా.. సరిలేరు నీకెవ్వరు వస్తోంది. అందుకే 96 రిలీజ్‌పై దిల్ రాజు కంగారు పడడంలేదు. 96ని ఫిబ్రవరి మూడవ వారానికి లేదా వేసవికి విడుదల చేయాలని డిసైడ్‌ అయినట్టు కనిపిస్తోంది.