నేటితో ఆర్టీసీ సమ్మెకు పులిస్టాప్ ?
ఆర్టీసీ సమ్మెకు నేటితో పులిస్టాప్ పడనుందా ? అంటే.. ఆ దిశకు పరిస్థితులు దారితీస్తున్న కనబడుతోంది. ఆర్టీసీ కార్మికులతో మరోసారి చర్చలు జరిపే ప్రసక్తే లేదన్న సీఎం కేసీఆర్.. తాజాగా చర్చలకి సుముఖత వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రగతి భవన్ లో ఆర్టీసీ ఎండీలతో భేటీ అయిన సీఎం కేసీఆర్ ఈడీలతో ఆర్టీసీ సంఘాల చర్చలకు ఓకే చెప్పారు. దాంతో.. శనివారం చర్చలు రావాల్సిందిగా ఆర్టీసీ ఏజేసీ నేతలకు యాజమాన్యం లేఖ రాసింది. మధ్యాహ్నం 2గంటలకు సమావేశానికి రావాలని లేఖలో తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు లేఖలు పంపారు. ఎర్రమంజిల్ లోని ఈఎన్ సీ కార్యాలయంలో చర్చలు జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఆర్టీసీ జేఏసీ నేతలు అత్యవసరంగా సమావేశమయ్యారు. ఆర్టీసీ యాజమాన్యంతో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయడం ప్రతిపాదన తప్ప.. మిగితా డిమాండ్లని ప్రభుత్వం ఓకే చేసే అవకాశం ఉంది. ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా కాస్త పట్టువిడుపుగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో.. ఈరోజుతో ఆర్టీసీ సమ్మెకు పులిస్టాప్ పడబోతున్నట్టు కనిపిస్తోంది.