జైలుకు చంద్రబాబు.. గేమ్ ప్లాన్ రెడీ ?
ఏపీ మాజీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకి జైలు శిక్ష తప్పదు. ఆయన్ని జైలుకి పంపించేందుకు వైకాపా ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది అంటూ తెదేపా మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు.. ఈ విషయాని తాను చంద్రబాబు కూడా చెప్పినట్టు జేసీ చెప్పడం విశేషం. ఐతే, బాబు మాత్రం తానేమీ తప్పు చేయలేదు. నన్నేమీ చేయలేరు అన్నారట.
ఇక జేసీ విషయానికొస్తే.. ఆయన ముక్కుసూటి మనిషి. ఆయన ప్రత్యర్థి పార్టీ, సొంత పార్టీపై కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తుంటారు. జేసీ మీడియా ముందుకు వస్తేనే సంచలనం. దీపావళీ కానుకగా జేసీ మీడియా ముందుకు వచ్చి.. చంద్రబాబు జైలుకి వెళ్లడం ఖాయం. ఈ మేరకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.
గతంలో చంద్రబాబుపై చాలా కేసులు పెట్టారు. కానీ అవేవి నిలబడలేదు. దానికి కారణం కేంద్రంలో తన పలుకుబడిని ఉపయోగించుకొని చంద్రబాబు తనపై పెట్టిన కేసులని నీరు గారేలా చేశారని వైకాపా శ్రేణులు ఆరోపిస్తుంటారు. ఇక ఇప్పుడు జేసీ చెప్పినట్టుగా చంద్రబాబుకు జైలుకి వెళ్లడం ఖాయం అన్నది నిజమైతే.. అది ఓటుకు నోటు కేసు అయి ఉండాలి. లేదంటే.. అమరావతి నిర్మాణంలో ఏదైనా కొత్త కుంభకోణం బయటపడటం అందులో బాబు హస్తం ఉండటమైన జరగాలి. మరీ.. ఏం జరుగుతుందో వేచి చూడాలి.