మహేష్ సినిమా ప్రీ క్లైమాక్స్ వరలు లీకు !


అనిల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందన కథానాయిక. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలని దసరా నుంచే మొదలెట్టిన సంగతి తెలిసిందే. ఇక దీపావళీ కానుకగా సరిలేరు నుంచి కానుకలు క్యూ కట్టాయ్. 

విజయశాంతి, రస్మికల ఫస్ట్ లుక్ లు వచ్చేశాయ్. మహేష్ కొత్త పోస్టర్ వచ్చేసింది. అవన్నీ ప్రిన్స్ ఫ్యాన్స్ కడుపునింపేశాయ్. అంతేకాదు.. సరిలేరు నుంచి టపాస్ లాంటి వీడియో ఒకటి వచ్చింది. ఇందులో సినిమా ప్రీ క్లైమాక్స్ వరకు లీక్ చేశారు. ఇందులో అజయ్, వెన్నెల కిషోర్ ఇద్దరు కూర్చొని సినిమా కథ గురించి చర్చించుకుంటూ ఉంటారు. ట్రైన్ ఎపిసోడ్, కర్నూల్ ఎపిసోడ్, ప్రకాష్ రాజ్, రష్మిక, ఆ తరువాత హీరో ఎంట్రీ అని చెప్పుకుంటూ ఉండగా దర్శకుడు అనిల్ రావిపూడి రావడం.. ఏం జరుగుతుందని ప్రశ్నించగా, కొంచం స్క్రీన్ ప్లే.. స్టోరీ చెప్తున్నా అని చెప్పడంతో కొంచం కాదు.. ప్రీ క్లైమాక్స్ వరకు వెళ్లిపోయారనడం ఆకట్టుకొంది.