వర్మపై పోలీస్ కేసు


దర్శకుడు రామ్ గోపాల్ వర్మకి వివాదాలు కొత్తమీకాదు. వివాదాలతో కడుపునింపుకొనే రకం ఆయన. అలాంటి వర్మ ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సినిమాతో మరోసారి వివాదాలకి తెరలేపారు. ఈ సినిమా ట్రైలర్ దీపావళీ కానుకగా ఆదివారం విడుదలైంది. ట్రైలర్ ని చూస్తే.. ఈ సినిమాలో వర్మ తెదేపా, వైకాపాలని టార్గెట్ చేసినట్టు కనిపించింది. ఐతే, భిన్నంగా కాంగ్రెస్ నేతలు కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేయడం విశేషం. 

‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్ సరైనది కాదు. కొన్ని సామాజిక వర్గాల మనోభావాలు దెబ్బతినే విధంగా టైటిల్ ఉందని, వెంటనే వర్మ ఆ టైటిల్ ను మార్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. దీనిపై కాంగ్రెస్ నేతలు అనంతపురం టూటౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. అసలు వర్మ టార్గెట్ చేసిన తెదేపా, వైకాపా పార్టీలు సలైంట్ ఉండటం.. కాంగ్రెస్ పార్టీకి కాలడం చూస్తుంటే విచిత్రంగా అనిపించక మానదు. మరీ.. కాంగ్రెస్ నేతల అభ్యంతరాలని దృష్టిలో పెట్టుకొని వర్మ టైటిల్ మారుస్తాడేమో చూడాలి. బహుశా.. అది జరగని పనేమో. ఇలాంటి వివాదాలు వర్మకి కొత్తేమీ కాదు. వాటితో సినిమాకి ప్రీ పబ్లిసిటీ తెచ్చుకోవడంలో వర్మ దిట్ట.