రామ్ టైటిల్ ‘రెడ్’

‘ఇస్మార్ట్ శంకర్’తో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చేశారు ఎనర్జిటిక్ హీరో రామ్. ఈ సినిమా రామ్ మరోసారి కిషోర్ తిరుమలతో జతకట్టబోతున్నారు. వీరి కలయికలో రాబోతున్న హ్యాట్రిక్ చిత్రం టైటిల్ ని ప్రకటించారు. ఈ చిత్రానికి రెడ్ (RED) అనే టైటిల్ ని పెట్టారు. అంతేకాదు.. సినిమా నుంచి రామ్ ఫస్ట్ లుక్ ని కూడా వదిలారు.  ఇందులో రామ్ వెనక్కి తిరిగి చూస్తూ ఉన్న స్టిల్ అభిమానులను ఆకట్టుకుంటోంది. మాస్ లుక్ లోనే రామ్ కనిపిస్తున్నారు. 

రామ్-కిషోర్ తిరుమల కలయికలో వచ్చిన నేను శైలజ, ఉన్నదీ ఒక్కటే జిందగీ సినిమాలు మంచి విజయాలని అందుకొన్నాయ్. వీరి కలయికలో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా ‘రెడ్’ సస్పెన్స్ థ్రిల్లర్ తమిళంలో విజయం సాధించిన తడమ్ కి రీమేక్  గా ఇది రాబోతోంది. ఈ సినిమాలో రామ్ కి జంటగా నటించే హీరోయిన్ ఎవరు ? మిగితా నటీనటుల వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించనున్నారు. స్రవంతి మూవీస్  పతాకంపై స్రవంతి రవికిషోర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.