అదా శర్మ రాటుదేలుతోంది.. !


‘హార్ట్ ఎటాక్’తో తెలుగు తెరకు పరిచయం అయింది పొడుగుకాళ్ల సుందరి అదాశర్మ. సన్నాఫ్ సత్యమూరి, క్షణం, కల్కీ సినిమాలతో ఆకట్టుకొంది. కాకపోతే బిజీ హీరోయిన్ అనిపించుకోలేకపోయింది. ఐతే, చిలిపి వీడియో, హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంది. అదా చేసిన ఒకట్రెండు టిక్ టాక్ వీడియోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు రెడీ అవుతోంది. ఇందులో మార్షల్ ఆర్ట్స్ తెలిసిన అమ్మాయిగా కనిపించబోతుంది. ఆ పాత్ర కోసం ప్రాచీన యుద్ద విద్యలైన కలరిపట్టు, సిలింబమ్, నాంచక్ విద్యను నేర్చుకుంటుందట. మరీ సుకుమారంగా ఉన్న అదా శర్మ యుద్ధ విద్యల్లో రాటుదేలుతోంది. కదనరంగంలోకి దిగి తన ప్రతాపం చూపించబోతుంది.