సంపూ సిక్స్ ప్యాక్ బాడీతో.. !

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సిక్స్ బాడీతో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన కసరత్తులు చేస్తున్నారు. ‘కొబ్బరిమట్ట’ తర్వాత సంపూ చేయబోయే సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి. దర్శకుడు ఎవరు ? సినిమా పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. కానీ, ఇందులో సంపూ సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించబోతున్నారు.

దీనికోసం సంపూర్ణేష్ బాబు జిమ్ లో కసరత్తులు మొదలు పెట్టాడు. బర్నింగ్ స్టార్ సంపూ జిమ్ లో చెమటలు పట్టేలా కష్టపడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను సంపూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మీరు ఏ ప్యాక్ కావాలో కోరుకోండి.. తదుపరి చిత్రం కోసం సిద్ధం అవుతున్నాయి అంటూ సంపూ కామెంట్ పెట్టాడు. సంపూ పొట్టతో బరిలోకి దిగితేనే.. ఫుల్లుగా నవ్వించేశాడు. ఇక స్లిమ్ గా మారితే.. రచ్చ రచ్చే.