జమ్మూకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత

జమ్మూకశ్మీర్‌లో విధించిన రాష్ట్రపతి పాలనను గురువారం ఎత్తివేశారు. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ కార్యాలయం నుంచి అధికారిక నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. జమ్మూకశ్మీర్‌ ఇప్పుడు కశ్మీర్‌, లద్ధాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356 ప్రకారం.. ఆ రాష్ట్రంలో విధించిన రాష్ట్రపతి పాలన కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించదు. దీంతో దాన్ని ఎత్తివేస్తున్నట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ ప్రకటించారు.

లద్దాఖ్‌ కేంద్రపాలిత ప్రాంతానికి తొలి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఆర్‌.కె. మాథుర్‌,కశ్మీర్‌ గవర్నర్‌గా గిరిశ్‌ చంద్ర ముర్ము లని కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే. వీరిద్దరు ఇవాళ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. మరోవైపు, జమ్మూకశ్మీర్‌ విభజన అమల్లోకి రావడంతో ఎన్నికల కమిషన్‌ త్వరలోనే పునర్విభజన ప్రక్రియ చేపట్టనుంది. సరిహద్దులను మార్చిన తర్వాత జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో 114 సీట్లు ఉండనున్నట్లు తెలుస్తోంది.