సప్రైజ్ : ‘దబాంగ్ 3’లో ప్రీతి జింటా

‘దబాంగ్’ సిరీస్ లో మూడో పార్ట్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్ జంటగా సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ విలన్ గా నటిస్తున్నారు. టాలీవుడ్  కమెడియన్ అలీ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నారు. డిసెంబర్ 20 దబాంగ్ 3 ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సప్రైజ్ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు సల్మాన్. ఇందులో ప్రీతి జింటా పోలీస్ గా కనిపిస్తున్నారు. దంబాంగ్ 3 లో ఆమె గెస్ట్ రోల్ లో మెరబోతుందని ఈ వీడియా ద్వారా తెలిపారు సల్మాన్. ఇప్పటికే విడుదలైన దబాంగ్ 3 ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది.