మాక్స్ వెల్’కు మానసిక ఆరోగ్య సమస్యలు
ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మాక్స్వెల్ షాకింగ్ న్యూస్ చెప్పాడు. ఆయన మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడట. దీంతో సడెన్ గా అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం ప్రకటించాడు. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగానే మాక్స్ వెల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సైకాలజిస్ట్ డాక్టర్ మైఖెల్ తెలిపారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించి మాక్స్ వెల్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అందువల్లే అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు అని మైఖెల్ తెలిపారు.
ప్రస్తుతం మాక్స్ వెల్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. ఇటీవల ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో మాక్స్ వెల్ 28 బంతుల్లో 62 పరుగులు చేశాడు. రెండో టీ20 మ్యాచ్ లో ఆయనకి బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఇక అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం తీసుకొన్న మాక్స్ వెల్ శ్రీలంకతో మూడో వన్ డే ని ఆడటం లేదు. ఆయన స్థానంలో డార్సీ షార్ట్ ను జట్టులోకి తీసుకోనున్నారు.