ప్రొడ్యూసర్ గ్రిల్డ్’లో అవకతవకలు
టాలీవుడ్ లో కొంతమంది బడా నిర్మాతలు కలిసి ఓ గ్రిల్డ్గా ఏర్పడిన సంగతి తెలిసిందే. చిన్న, పెద్ద సినిమాల ప్రచారాన్ని ఓ ప్లాన్ ప్రకారం, తక్కువ ఖర్చుతో చేసుకుంటూ వెళ్లడం గ్రిల్డ్ బాధ్యత. ఎవరికి యాడ్లు ఇవ్వాలి? ఎంతెంత ఇవ్వాలి? ఏ ఛానల్‌కి, ఏ పేపర్ కి ఎంత ఖర్చు చేయాలి? అనే విషయాన్ని గ్రిల్డ్ చూసుకుంటుంది. ఐతే, ఈ గ్రిల్డ్లోనూ అవకతవకలు మొదలయ్యాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. యాడ్లు ఇచ్చినందుకు కమీషన్లు తీసుకుంటున్నారని ఇండ్రస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఇప్పటికే ‘మా’ పరువు బజారుపడింది. మా అసోసియేషన్ లో విబేధాలు తారస్థాయికి చేరాయి. ఇటీవల అధ్యక్షుడు లేకుండానే మా జనరల్ మీటింగ్ నిర్వహించడంతో పెద్ద రచ్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రొడ్యూసర్ గ్రిల్డ్ పై కొందరు నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుకొన్నారు. కాకపోతే.. ఇంకా ఎవరు బయటపడలేదు. జాగ్రత్తగా పరిస్థితిని గమనిస్తున్నారు. త్వరలోనే ప్రొడ్యూసర్ గ్రిల్డ్ పై అవినీతి ఆరోపణలు బయటపడటం.. రచ్చ జరగడం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.