రవిశాస్త్రిపై గంగూలీ కీలక నిర్ణయం
సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు కాబోతున్నాడు అనగానే టీమిండియా కోచ్ రవిశాస్త్రీపై వేటు పడినట్టేననే ప్రచారం జరిగింది. వీరిద్దరికి పడదు అనే ప్రచారంలో క్రికెట్ వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వార్తలు బయటికొచ్చాయ్. అనుకొన్నట్టుగానే గంగూలీ రవిశాస్త్రీని టార్గెట్ చేశారు. అలాగని ఆయన్ని కోచ్ పదవి నుంచి తీసేసే పనులేమీ చేయలేదు. పైగా రవిశాస్త్రీకి అదనపు బాధ్యతలు అప్పగించాలని కీలక నిర్ణయం తీసుకొన్నారు.
జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఆటగాళ్లను తీర్చిదిద్దేందుకు రవిశాస్త్రి సేవలు వాడుకుంటామని గంగూలీ అన్నారు. జాతీయ జట్టు, ఎన్‌సీఏ మధ్య సమన్వయం సృష్టించేందుకు ఆయన్ను రెండు విధాలుగా ఉపయోగించుకోవాలని దాదా భావిస్తున్నారు. ‘రవి కోచ్‌గా ఉన్నంత వరకు ఎన్‌సీఏకు మరింత సహకారం అందించేలా ఒక వ్యవస్థను మేం సృష్టిస్తున్నాం. ఎన్‌సీఏను మేం అత్యద్భుత కేంద్రంగా మార్చాలని అనుకుంటున్నాం. మాకిప్పుడు రాహుల్ ద్రవిడ్, పరాస్ మహంబ్రే, భరత్ అరుణ్ సైతం ఉన్నారు’ అని గంగూలీ అన్నారు. ఐతే, రవిశాస్త్రికి అదనపు బాధ్యతలు అప్పగించడం వెనక.. గంగూలీకి ఏదైనా ఎత్తుగడ ఉందా ? డౌట్లు వస్తున్నాయ్.