రివ్యూ : ఆవిరి
చిత్రం : ఆవిరి (2019)
నటీనటులు : రవిబాబు, నేహా చౌహాన్, శ్రీముక్త
సంగీతం : వైద్ద్య్
దర్శకత్వం : రవిబాబు
నిర్మాతలు : దిల్ రాజు
రిలీజ్ డేటు : నవంబర్ 01, 2019.
రేటింగ్ : 2.5/5
‘అ’ రకంగా భయపెట్టడం దర్శకుడు రవిబాబు అలవాటు చేసుకొన్నారు. ‘అల్లరి’ మినహా అమరావతి, అనుసూయ, అవును సినిమాలు హారర్ జోనర్ లో వచ్చినవి. అవి మంచి విజయాన్ని అందుకొన్నాడు. అ సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తూ.. రవిబాబు చేసిన ప్రయోగం ‘అదిగో’ అట్టర్ ప్లాప్ అయింది. అయినా.. ఆయన ‘అ’ని వదల్లేదు. ఈసారి కాస్త దీర్ఘం తీసూ.. ‘ఆవిరి’ సినిమాని తెరకెక్కించారు. టీజర్స్, ట్రైలర్స్ తో ఆకట్టుకొన్న ‘ఆవిరి’ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. ‘ఆవిరి’ ఎలా ఉంది ?
కథ :
రాజ్ కుమార్ రావు (రవిబాబు), లీనా( నేహా చౌహాన్) దంపతులకి ఇద్దరు కూతుర్లు. పెద్దమ్మాయి పేరు శ్రేయ, చిన్నమ్మాయి పేరు మున్ని. హాయిగా సాగిపోతున్న రాజ్ ఫ్యామిలీలో పెద్ద విషాదం. ఓ ప్రమాదంలో పెద్ద కూతురు శ్రేయ మృతి చెందుతోంది. దీంతో లీనా కడుపుకోతని తట్టుకోలేక పోతుంది. అదే ఇంట్లో ఉంటే చనిపోయిన కూతురే గుర్తుకు వస్తుందని..రాజ్ తో మొరపెట్టుకుంటుంది.రాజ్ కూడా భార్య బాధని అర్థం చేసుకొని ఫ్యామిలీ కొత్త ఇంటికి మారుస్తాడు. అదోక పాత బంగ్లా. చాలా పెద్దది కూడా. ఐతే, ఆ బంగ్లాలోకి వెళ్లిన తర్వాత మున్ని విచిత్రంగా ప్రవర్థిస్తుంటుంది. దెయ్యంతో మాట్లాడుతుంటుంది. ఆ దెయ్యం ఎవరు ? ఈ క్రమంలో రాజ్ కుమార్, లీనా ఏం చేశారు ? ఆ దెయ్యానికి రాజ్ కుమార్ కి సంబంధం ఏమిటి ? అనేది ఆవిరి కథ.
ఎలా ఉంది ?
హారర్ థ్రిల్లర్ సినిమాలని చాలా ఆసక్తికరంగా ప్రారంభించాల్సి ఉంటుంది. ఒక్కసారి ప్రేక్షకుడిని కథలో లీనం చేశాక.. హారర్ సినిమాలు, ట్విస్టులు ఉక్కిరి బిక్కిరి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో ట్విస్ట్ ని రివీల్ చేస్తూ.. కథని ఆసక్తికరంగా ముగించాలి. ఐతే, ‘ఆవిరి’ ఫ్యామిలీ హారర్. ముందుగా ఫ్యామిలీ సన్నివేశాలు.. అటు నుంచి హారర్ జోనర్ లోకి వెళ్లేందుకు దర్శకుడు చాలా సమయం తీసుకొన్నాడు. దీంతో ఫస్టాఫ్ సాదాసీదాగా సాగింది. సెకాంఢాఫ్ లో కొన్ని హారర్ సీన్స్ బాగానే ఉన్నా.. అంత కిక్కునివ్వదు. మొత్తంగా.. ‘ఆవిరి’ అంత అద్భుతంగా ఏమీ లేదు. అక్కడక్కడ రవిబాబు మార్క్ కనిపించిందంతే.. !
ఎవరెలా చేశారు ?
ఇలాంటి సినిమాలు రవిబాబుకు కొట్టిన పిండి. రవిబాబు తనకు అలవాటైన ఎక్స్ ప్రెషన్స్ తో చాలా ఈజీగా నటించారు. నేహా చౌహాన్ ఫస్టాఫ్‌లో పర్వాలేదనిపించింది. ఐతే, దెయ్యం పట్టిన పాత్రలో మాత్రం ఆమెని చూడలేం. ఒకే ఎక్స్‌ప్రెషన్‌తో విసుగుపుట్టించింది. సినిమా మొత్తం కనిపించిన శ్రీ ముక్తా పర్వాలేదనిపించింది. పోలీస్ పాత్ర, డాక్టర్, జాన్వీ పాత్రలు కూడా బాగానే ఆకట్టుకున్నాయి. బిగ్ బాస్ కంటెస్టెంట్ హిమజ కమల పాత్రలో ఆకట్టుకొంది. చాలా తక్కువ పాత్రలతో తెరకెక్కిన చిత్రమిది.
సాంకేతికంగా :
సినిమాటోగ్రఫీ బాగుంది. అది హారర్ సన్నివేశాలని మరింత ఎలివేట్ చేశాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. సాగదీత సినిమాలు చాలానే ఉన్నాయి. కొన్ని సీన్స్ కత్తెర పెట్టొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
బాటమ్ లైన్ : ఆవిరి రొటీన్ హారర్ థ్రిల్లర్. అక్కడక్కడ మాత్రమే మెరుపులు. చాలా వరకు బోరింగ్.
రేటింగ్ : 2/5