శర్వా అమ్మగా అమల !
శర్వానంద్-రీతూ వర్మ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శ్రీకార్తీక్ దర్శకుడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా జెడ్ స్పీడుతో ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసుకొంది. శుక్రవారం నుంచి రెండో షెడ్యూల్ లో హైదరాబాద్ లో ప్రారంభం అయింది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పింది చిత్రబృందం. ఇందులో అమల అక్కినేని కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆమె శర్వాకి అమ్మగా కనిపించబోతున్నారు.
ఇక శర్వా తండ్రి పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ తండ్రి, నటుడు రవి రాఘవేంద్ర కనిపించనున్నారు. తాజా షెడ్యూల్ లో వీరిద్దరు పాల్గొంటున్నారు. 1993లో వచ్చిన ‘ఆగ్రహం’ తర్వాత అమల నటించిన చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’. ఆ తర్వాత ‘మనం’ సినిమాలో మెరిశారు. ఇప్పుడు శర్వానంద్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. కథ నచ్చడంతో అమల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక హిందీ సినిమాల్లో అమల అప్పుడప్పుడు మెరుస్తున్న సంగతి తెలిసిందే. గత యేడాది ఆమె కర్వాన్ లో నటించారు.