‘బిగ్ బాస్ 3’ టైటిల్ పోరు.. ఆ ఇద్దరి మధ్యే !

బిగ్ బాస్ 3 ఈ వారంతో ముగియనుంది. ఫైనల్ ఏపీసోడ్ కోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయ్. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. హాట్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, కేథరిన్ థెరిస్సా, అంజలి ఆటాపాటాలతో అలరించనున్నారు. ఇవే కాకుండా మరికొన్ని సప్రైజ్స్ ఉండనున్నట్టు సమాచారమ్.

మరోవైపు బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ గా ఎవరు నిలుస్తారన్నది ఆసకిగా మారింది. మొత్తం ఐదుగురు కంటెస్టెంట్స్ తో ఫైనల్ ఏపీసోడ్ జరగనుంది. వరుణ్ తేజ్, బాబా భాస్కర్, అలీ రెజా, రాహుల్, శ్రీముఖి టైటిల్ రేసులో ఉన్నారు. వీరిలో టైటిల్ పోరు రాహుల్, శ్రీముఖి మధ్యే ఉండనుందని చెబుతున్నారు.

ప్రస్తుతం ట్రేడ్ ప్రకారం ఓటింగ్ లో రాహుల్ ముందంజలో ఉన్నారు. ఆయన సమీపంలో శ్రీముఖి ఉన్నట్టు తెలుస్తోంది. బాబా భాస్కర్, వరుణ్ తేజ్ లు గట్టిపోటీ దారులు అని ప్రచారం జరిగినా.. ఫైనల్ ఏపీసోడ్ కి  ముందు వారిద్దరు అనూహ్యంగా వెనకబడిపోయారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ గా రాహుల్, శ్రీముఖిలలో ఒకరు నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఇక, బిగ్ బాస్ సీజన్-1 విజేతగా శివ బాలాజీ, సీజన్-2 విజేతగా కౌశల్ నిలిచారు. రెండ్రోజుల్లో సీజన్ -3 విజేత ఎవరన్నది తేలపోనుంది.