మళ్లీ ఎన్నికల నగారా మ్రోగింది !


దేశంలో మరోసారి ఎన్నికల నగారా మ్రోగింది. ఇటీవలే మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఇంకా హీట్ చల్లారనే లేదు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. అప్పుడే జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మ్రోగింది. షెడ్యూల్ ని విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో నేటి నుంచే జార్ఖండ్ లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.

81 స్థానాలు ఉన్న జార్ఖండ్ రాష్ట్రానికి మొత్తం ఐదు విడతల్లో.. ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 30న ఫస్ట్ ఫేస్ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 7, 12, 16, 20 తేదీల్లో వరుసగా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫైనల్ ఫేస్ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ప్రస్తుతం జార్ఖండ్ లో బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ మరోసారి అధికారంలోకి రావాలని కమలనాథులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.