హరీష్ రావుకు రూ. 50లక్షల జరిమానా !
తెలంగాణ ఆర్థిక మంత్రి హారీష్ రావుకు రూ. 50లక్షల జరిమానా పడింది. ఆయనకి ఈ జరిమానా ఎవరు విధించలేదు. తనకి తానే విధించుకొన్నారు. స్వీయ జరిమానా అన్నమాట. ఎందుకు ? అంటే.. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలిక పరిధిలోని మహిళా సంఘాల ప్రతినిధులకు చెత్తబుట్టలను అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఆలస్యంగా వచ్చారు.
దీంతో తనకు తానుగా రూ.50లక్షల జరిమానా విధించుకున్నారు. ఈ నిధులతో ఆధునిక హంగులతో మహిళా భవనాన్ని నిర్మిస్తానని ప్రజలకు హారీష్ హామీ ఇచ్చారు. త్వరలోనే విధులని విడుదల చేస్తామని, స్వచ్ఛ దుబ్బాకగా మార్చేందుకు మహిళా ప్రతినిధులు ముందుకు రావాలని మంత్రి కోరారు. తడిపొడి చెత్తను వేసేందుకు రూ.3 కోట్లతో డంపింగ్ యార్డు మంజూరు చేశామని.. సిద్ధిపేట తరహాలోనే దుబ్బాకను కూడా అభివృద్ధి చేస్తామని హరీష్ హామీ ఇచ్చారు. హారీష్ మాదిరిగా.. మిగితా మంత్రులు, రాజకీయ నేతలు, ప్రభుత్వ ఉద్యోగులు ఇలా స్వీయ జరిమానా ఫార్ములా పాటిస్తే.. ఎంత బాగుంటుందో..!