రజనీకి గోల్డెన్ జూబ్లీ అవార్డ్‌

సూపర్ స్టార్ రజనీకాంత్ గోల్డెన్ జూబ్లీ అవార్డ్ అందుకోనున్నారు. ఈ నెల 20 నుంచి గోవా వేదికగా ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ వేడుక‌లో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ని గోల్డెన్ జూబ్లీ అవార్డ్‌తో సత్కరించ‌నున్నారు. ఈ విష‌యాన్ని బ్రాడ్‌కాస్టింగ్ మినిస్ట‌ర్ ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ కొద్ది సేప‌టి క్రితం ప్ర‌క‌టించారు. దీనిపై రజనీ స్పందించారు.  ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌ గౌర‌వం అందించినందుకు ర‌జ‌నీకాంత్ భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిజేశారు.

ఈ నెల 20 నుంచి 28 వరకు ఐఎఫ్‌ఎఫ్‌ఐ ఉత్స‌వాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో 250కి పైగా సినిమాలు ప్ర‌ద‌ర్శ‌న జ‌రుపుకోనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా..  లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ ఫ్రెంచ్ యాక్ట‌ర్ ఇసాబెల్లె హ‌ప్ప‌ర్ట్‌కి అందించనున్నారు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ త్వరలోనే రాజకీయాల్లో బిజీ కానున్నారు. పార్టీ ఏర్పాటుపై వేగం పెంచారు. ఇందులో భాగంగా ఆయన రాజకీయ వ్యూహాకర్త కోసం వెతుకుతున్నారు. దర్భార్ సినిమాని పూర్తి చేసిన రజనీ దర్శకుడు శివతో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. అదే రజనీ ఆఖరు సినిమా. ఆ తర్వాత ఫుల్ టైం రాజకీయాల్లోకి వెళ్లనున్నారని టాక్.