వర్మకి రాజమౌళి రిక్వెస్ట్ !

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, దర్శకధీరుడు రాజమౌళి మధ్య ఆసక్తికర ట్విట్ చాట్ జరిగింది. వర్మ తాజా చిత్రం ‘కమ్మరాజ్యంలో కడప రెడ్లు’. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్టు తెలుస్తోంది. ఈ నెలలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో తనదైన శైలిలో సినిమాకి ప్రమోట్ చేస్తున్నారు వర్మ. ఇందులో భాగంగా కేఏ పాల్ పాటని ఒకటి వదిలారు. అది వైరల్ అవుతోంది. 

అంతేకాదు.. కేఏ పాల్ తో రాజమౌళి బాహుబలి ప్లాన్ చేస్తున్నారని ఓ ట్విట్ వదిలారు. “కేఏ పాల్ జీవితచరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ తీస్తే అది ‘బాహుబలి-3’ కంటే భారీ విజయం సాధిస్తుంది. దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం వాషింగ్టన్‌లో కేఏ పాల్‌తో ఈ సినిమా విషయమై చర్చలు జరుపుతున్నట్టు విన్నాను. ఈ విషయం కేఏ పాల్ స్వయంగా నాకు ఫోన్ చేసి చెప్పారు”అని వర్మ ట్విట్ చేశారు.

ఈ ట్విట్ కు రాజమౌళి స్పందిస్తూ.. ‘నన్ను ఇన్వాల్వ్ చేయకండి ‘రాజు’ గారూ’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు వర్మ రిప్లై ఇచ్చారు. ‘నేను ఇన్వాల్వ్ చేయడం కాదు సర్. ట్రంప్ టవర్‌లోని మీరు, కేఏ పాల్ కలిసి లంచ్ చేశారని, ‘బాహుబలి-3′ కోసం అతనితో సంతకం పెట్టించుకున్నారని కేఏ పాల్ నాకు చెప్పాడు. కావాలంటే కేఏ పాల్ మీద ఒట్టు’ రాసుకొచ్చారు వర్మ.