‘బిగ్ బాస్ 3 విన్నర్’ని తేల్చేస్తున్నారు !

బిగ్ బాస్ 3 ఈ వారంతో ముగియనుంది. ఫైనల్ ఏపీసోడ్ కు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అథితిగా హాజరుకానున్నారు. ఒకరిద్దరు హాట్ హీరోయిన్స్ బిగ్ బాస్ 3 వేడుకపై చిందేయనున్నారు. ఇదంతా.. ఓకే. ఇంతకీ బిగ్ బాస్ 3 విజేతగా ఎవరు నిలవబోతున్నారు. ఇప్పుడిదే విషయాన్ని తేల్చేస్తున్నారు నెటిజన్స్. బిగ్ బాస్ 3 టైటిల్ విన్నర్ శ్రీముఖీ అంటూ ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు.. నాగ్ చేతుల మీదుగా టైటిల్ అందుకొంటున్న పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

మరోవైపు, బిగ్ బాస్ 3 విజేత రాహుల్ సిప్లగంజ్ అంటూ న్యూస్ హల్ చల్ చేస్తోంది. దీని వెనక ఓ బలమైన సెంటిమెంట్ గురించి చెబుతున్నారు. బిగ్ బాస్ 2 విజేతగా కౌశల్ నిలిచిన సంగతి తెలిసిందే. సీజన్ లో అత్యధిక సార్లు నామినేషన్ లో నిలిచింది కౌశల్ నే. ఏకంగా 11 సార్లు ఎలిమినేషన్ ని ఎదుర్కొన్నారు. తద్వారా ఆయనపై జనాల్లో సింపతి ఏర్పడింది. దాంతో కౌశల్ పేరిట పెద్ద ఎత్తున అభిమాన గణం ఏర్పడింది. కౌశల్ పేరిట ర్యాలీలు, ఫ్లెక్సీలు ఏర్పాడ్డాయ్. ఫైనల్ గా కౌశల్ బిగ్ బాస్ 2 విజేతగా నిలిచారు.

ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ని రాహుల్ సిప్లిగంజ్ కు అప్లై చేస్తున్నారు. సీజన్ 3లో రాహుల్ 11 సార్లు ఎలిమినేషన్ లో నిలిచారు. ఇక శ్రీముఖి రాహుల్ ని ప్రత్యేకంగా టార్గెట్ చేసింది. ఆమె ప్రతిసార్లు రాహుల్ ని నామినేషన్ కి నామినేట్ చేసింది. ఈ నేపథ్యంలో రాహుల్ పై జనాల్లో సింపతి ఏర్పడింది. దానికితోడు టైటిల్ పోరులో రాహుల్, శ్రీముఖి గట్టిగా పోటీ పడుతుండటంతో.. అత్యధిక మంది రాహుల్ నే సపోర్ట్ చేస్తున్నారు. ఆయనకే ఎక్కువ ఓటింగ్ పడింది. బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ అని తేల్చేస్తున్నారు.