నాని ‘అ’లో నిత్యా మీనన్ ఫస్ట్ లుక్

నాని నిర్మాతగా మారి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి ‘అ’ టైటిల్, ‘ప్ర‌పంచంలోనే నేను, నాలోని ప్ర‌పంచం’ అంటూ ట్యాగ్ టైన్ పెట్టారు. ఈ మూవీకి ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌కుడు. ఇటీవలే ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇప్పుడీ సినిమాలో హీరోయిన్ నిత్యామీనన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. దీంతో.. నాని ‘అ’ నిత్యామీనన్ లీడరోల్ లో తెరకెక్కుతోందన్న విషయం స్పష్టమయింది.

కథల ఎంపిక విషయంలో నాని టేస్ట్ బాగుంటుందని చెప్పుకొంటుంటారు. హీరోయిన్ నిత్యామీనన్ కు సేమ్ బ్రాండ్ ఉంది. అలాంటి వీరిద్దరి కలయికలో వస్తోన్న ‘అ’ #Awe పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నాని చెప్పినట్టుగా ఇప్పటివరకు టచ్ చేయని కథలాగే సినిమాలో నిత్యా మీనన్ లుక్ కూడా విభిన్నంగా ఉంది.