కేసీఆర్ రిక్వెస్ట్ ఎఫెక్ట్ : తిరిగి విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులు

ముఖ్యమంత్రి కేసీఆర్ రిక్వెస్ట్ ఫలించింది. ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లో చేరుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, సమస్యలు, డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గత 30రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.ఐతే, సమ్మె విషయంలో ఇటు ప్రభుత్వం, అటు కార్మికులు మెట్టుదికపోవడంతో సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో శనివారం సమావేశమైన తెలంగాణ కేభినేట్ ఆర్టీసీ విషయంలో కీలక నిర్ణయాయం తీసుకొంది. 

50-50 ప్రభుత్వ-ప్రయివేటు భాగస్వామ్యంతో ఆర్టీసీని నడపబోతున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 10,400 బస్సులు ఉన్నాయి. వీటిలో 2100 ప్రయివేటు బస్సులు ఉన్నాయి. మరో 3000 ప్రయివేటు బస్సులని తీసుకోనున్నామని తెలిపారు. అదే సమయంలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులని ఈ నెల 5లోగా విధుల్లోకి చేరాలని సీఎం రిక్వెస్ట్ చేశారు.“రాష్ట్రం తెచ్చిన నాయకుడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గా అప్పీల్ చేస్తున్న యూనియన్ మాయలో పడి ఆగం కాకుర్రి.. మీ కుటుంబాన్ని బజారున పడెయ్యకండి నవంబర్ 5 లోపు ఉద్యోగం లో చేరండి. ప్రభుత్వం ఇచ్చిన సదవకాశాన్ని ఉపయోగించుకోండి” అని కోరారు.

సీఎం రిక్వెస్ట్ తో ఆర్టీసీ కార్మికుల్లో కదిలక వచ్చింది. ఈరోజు ఉదయమే చాలామంది కార్మికులు విధుల్లోకి చేరేందుకు డిపోలకి చేరుకొన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట, భద్రాచలం డిపోలలో కార్మికులు విధుల్లో చేరుతామని లేఖలు ఇచ్చారు. మరోవైపు, ఆర్టీసీ కార్మికుల జేఏసీ నేతలు సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యచరణపై చర్చిస్తున్నారు. మరీ.. కొన్ని డిమాండ్లు అయినా పరిష్కారించాల్సిందిగా ప్రభుత్వంతో రాజీకి వస్తారా ? లేదంటే సమ్మె యధాతథం అంటూ ముందుకెళ్తారా అనేది చూడాలి.