సమ్మె యధాతథం.. ఆర్టీసీ జేఏసీ నిర్ణయం ! మరీ కార్మికులు సపోర్ట్ చేస్తారా ?

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పులేదు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ శనివారం మరోసారి స్పష్టం చేశారు. అంతేకాదు.. శనివారం జరిగిన కేభినేట్ సమావేంలో ఆర్టీసీపై కీలక నిర్ణయాలు తీసుకొన్నట్టు తెలిపారు. ఆర్టీసీని 50-50 ప్రభుత్వం-ప్రయివేటు భాగస్వామ్యంతో నడపబోతున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా మరో 3000 ప్రయివేటు బస్సులకి అనుమతులు ఇవ్వబోతున్నట్టు తెలిపారు. అదే సమయంలో ఆర్టీసీ కార్మికులు.. ఈ నెల 5లోగా విధుల్లోకి చేరాలని రిక్వెస్ట్ చేశారు.

ఈ నేపథ్యంలో కొందరు ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లో చేరుతున్నారు. మరోవైపు, ఆర్టీసీ జేఏసీ నేతలు ఆదివారం హైదరాబాద్‌లోని టీఎంయూ కార్యాలయంలో సమావేశమయ్యారు. భవిష్యత్ కార్యచరణపై చర్చించారు. సమావేశం అనంతరం మాట్లాడిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి.. సమ్మె యథాతథంగా కొనసాగుతుందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఏకపక్ష నిర్ణయం సరికాదు. ఉద్యోగులను తొలగించే హక్కు ఎవరికీ లేదన్నారు. 5వేల బస్సులకు 27వేల మంది కార్మికులే అవసరమని, మిగతా 23వేల కార్మికులను ఏం చేస్తారు? అని ప్రశ్నించారు. డిపో మేనేజర్లు రేపటి నుంచి సమ్మెకు మద్దతు ఇవ్వాలన్నారు. మరీ.. ఆర్టీసీ జేఏసీ కోరినట్టుగా కార్మికులు సమ్మెని కొనసాగిస్తారా ? లేదంటే.. సీఎం కేసీఆర్ ఇచ్చిన డెడ్ లోగా తిరిగి విధుల్లోకి చేరుతారా ? అన్నది చూడాలి.