‘ఖైదీ’ ఘన విజయంపై కార్తీ ట్విట్ 

హిట్ ఇచ్చే కిక్కే వేరు. ప్రస్తుతం హీరో కార్తీ ‘ఖైదీ’ హిట్ కిక్కులో ఉన్నారు. ఈ చిత్రానికి లోకేశ్ కనకరాజు దర్శకత్వం వహించారు.  ఈ చిత్రంలో కార్తి పదేళ్లు జైలు శిక్షను అనుభవించిన ఢిల్లీ అనే ఖైదీ పాత్రలో కనిపించారు. తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్ ఈ సినిమాకి మరో హైలైట్. ఈ సినిమాలో హీరోయిన్ లేదు. పాటల్లేవ్. అయినా.. కథ-కథనాలు ఉత్కంఠభరితంగా సాగాయి. అవే ప్రేక్షకులని అమితంగా ఆకట్టుకొన్నాయి. ఫలితంగా ఖైదీ ని సూపర్ హిట్ చేశారు. ప్రేక్షకులు, సినీ ప్రముఖులు ఖైదీపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ప్రేక్షకులకి హీరో కార్తీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. “ఖైదీ చిత్రానికి ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ఏవిధంగా ధన్యవాదాలు చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ప్రతి ఒక్కరూ ఉత్కంఠగా చూసేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనే ఉద్దేశంతో మా చిత్రబృందం మనసు పెట్టి పనిచేసింది. ప్రేక్షకులను నుంచి ఇంతటి గొప్ప స్పందనను మేము ఉహించలేదు. మమ్మల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు” అని కార్తి రాసుకొచ్చారు.