బిగ్‌బాస్’పై కోపంతో రాజకీయాల్లోకి నటి !
బిగ్ బాస్ షోపై అన్నీ బాషల్లో ఆరోపణలొచ్చాయ్. బిగ్ బాస్ తెలుగు సీజన్-3 ప్రారంభానికి ముందు సంచలన ఆరోపణలే తెరపైకి వచ్చాయి. బిగ్ బాస్ ముసుగులో పడకగదికి పిలుస్తున్నారని, కమిట్ మెంట్ అడుగుతున్నారని ఒకరిద్దరు ఆరోపించారు. ఆ తర్వాత అవి సర్థుకొని బిగ్ బాస్ 3 తెలుగు సీజన్ 3 ప్రారంభం అయింది. విజయవంతంగా పూర్తి చేసుకొంది. బిగ్ బాస్ 3 విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచారు. ఇక కోలీవుడ్ బిగ్ బాస్ 3 సీజన్ కాస్త ముందుగానే నిలిచింది.
తెలుగు బిగ్ బాస్ తో పోలీస్తే తమిళ్ బిగ్ బాస్ పై ఆరోపణలు ఎక్కువగా వచ్చాయ్. ఇంకా వస్తున్నాయ్. తాజాగా నటి మీరా మిథన్ బిగ్ బాస్ పై తీవ్ర ఆరోపణలు చేసింది. బిగ్‌బాస్ కార్యక్రమంలో పాల్గొన్నా… హౌస్ నుంచి బయటకు వచ్చి నెల రోజులు దాటుతోంది. ఇప్పటికీ ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంబంధిత వర్గాలు ఒక్క పైసా కూడా పారితోషికం ఇవ్వలేదు. దీనికి సంబంధించి విజయ్ టీవీ నిర్వాహకులను అడిగినా స్పందించడం లేదు. నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చెప్పింది.
అంతేకాదు.. నా గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. అందువల్ల విజయ్ టీవీ నాకు రూ.కోటి పరిహారంగా ఇవ్వాలి. నాపై పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. ఈ రాష్ట్రంలో నాకు భద్రత కరవైంది. అందుకే నేను రాజకీయాల్లోకి వెళ్తున్నా. త్వరలోనే రాజకీయ ప్రవేశం చేయనున్నా. అయితే ఏ పార్టీలో చేరాలనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ పై కోపంతో రాజకీయాల్లోకి వెళ్లడమేంటో.. అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.