బిగ్ బాస్ ఫినాలే : ప్లస్ లూ.. మైనస్ లూ !

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 విజయవంతంగా పూర్తయింది. 15 వారాల పాటు ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన బిగ్ బాస్ 3 విజేతగా గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా రూ.50లక్షల నగదు బహుమతి, ట్రోఫీని అందుకున్నారు. సోమవారం సుధీర్ఘంగా జరిగిన బిగ్ బాస్ ఫినాలో కోసం బిగ్ బాస్ యాజమాన్యం గ్రాండ్ గా ఏర్పాట్లు చేసింది. అయినా… కొన్ని పొరపాట్లు జరిగాయ్. ఫినాలే ప్లస్ లూ.. మైనస్ లపై ఓ లుక్కేద్దాం పదండీ.. !

ప్లస్ లు :

* ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాకతో షోకి కలొచ్చింది.

* కింగ్ నాగార్జున చాలా ఎనర్టిటిక్ గా కనిపించారు. ఫినాలేని తనదైన శైలిలో నడిపించారు.

* హాట్ హీరోయిన్స్ నిధి అగర్వాల్, కేథరిన్, అంజలి, రాశీఖన్నా రాకతో పెద్ద అవార్డుల ఫంక్షని తలపించింది.

* ఇక ఫైనల్ కి చేరిన ఐదుగురు కంటెస్టెంట్స్ కి రూ. 10 లక్షలు, 20లక్షలు ఆఫర్ చేస్తూ ఎలిమినేట్ కావడానికి టెంప్ట్ చేయడం ఆకట్టుకొంది.

* రాహుల్ విజేతగా నిలవడంతో బిగ్ బాస్ యాజమాన్యంతో శ్రీముఖీ రాజకీయాలు అంటూ ప్రచారానికి చెక్ పడినట్టయింది.

మైనస్ లు :

* సాయంత్రం 6 గంటలకి ప్రారంభమైన ఫినాలే రాత్రి 10:30 నిమిషాల వరకు సాగింది. దాదాపు 4గంటలకి పైగా షో నడవడం పెద్ద మైనస్ గా చెప్పాలి.

* 3గంటల సినిమా చూసే ఓపికనే ప్రేక్షకులకి ఉండటం లేదు. మరీ.. ఏ దైర్యంతో బిగ్ బాస్ యాజమాన్యం షోని 4గంటలకిపై గా ప్లాన్ చేసింది.

* పైగా సోమవారం భారత్-బంగ్లా జట్ల మధ్య తొలి టీ20 జరిగింది. మరోవైపు, విశాఖలో జనసేన లాంగ్ మార్చ్ హైలైట్ గా నిలిచింది.

* ఈ నేపథ్యంలో ఫినాలే నిడివి పెద్ద మైనస్ అని చెబుతున్నారు

* ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ బిగ్ బా స్టేజ్ పై చిందేశారు. ఐతే, వారి కాస్టూమ్స్ బాగోలేదు.
* బిగ్ బాస్ విన్నర్ విషయంలో ఎలాంటి సప్రైజ్ లేదు. అలాగని రాహుల్ విజేత కాకూడదని కాదు.

* ఆ విషయాన్ని రెండ్రోజుల ముందే లీక్ కాకుండా జాగ్రత్తపడాల్సింది.

* ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా పునర్నవి గారు అంటూ… ఆమెకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ప్రేక్షకులకి నచ్చలేదని టాక్.