బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్.. దూల్ పేట్ లో ధూమ్ ధామ్ !

బిగ్ బాస్ 3 విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచారు.  ఆదివారం రాత్రి 10గంటల తర్వాత ఈ విషయం తెలిసింది. దీంతో దూల్ పేటలో సంబరాలు మొదలయ్యాయ్. ఎందుకంటే ? రాహుల్ దూల్ పేట్ పోరగాడు. రాహుల్ ఇంటిదగ్గర సందడి నెలకొంది. రాహుల్ గెలుపుతుని ధూల్ పేటలో ధూమ్ దామ్ గా సెలబ్రేట్ చేసుకొన్నారు. ఇక ఇంటికి చేరుకొన్న తర్వాత మీడియాతో మాట్లాడిన రాహుల్.. తన విజయానికి తల్లిదండ్రులు, స్నేహితు కారణమన్నారు. తన విజయంలో పునర్నవికి క్రెడిట్ ఇచ్చారు. 

ఆమె ప్రోత్సాహం మరవలేనిది. తాను టాస్క్ లు చేసేందుకు ప్రోత్సహించింది. బతిమిలాడి, తిట్టింది, కొట్టింది కూడా. ఆమెని ఎప్పుడు డేట్ కి తీసుకెళ్తున్నారు అంటే.. పునర్నవికి ప్రపోజ్ చేసిన మాట నిజమే. ఆమెకు ఆల్ రెడీ బోయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పింది. ప్రాణ స్నేహితుడు ఉంటారు. పునర్నవి తాను ప్రాణ స్నేహితురాలు. అంతకంటే ఇంకొంచెం ఎక్కువ అన్నారు.ఇక, వచ్చిన బిగ్ బాస్ ప్రైజ్ మనీతో తల్లిదండ్రులకి ఇల్లు కొనిస్తానని చెప్పారు.