మళ్లీ పవన్ ని గెలికిన పూనమ్ ! 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో మాజీ హీరోయిన్ పూనమ్ కౌర్ కు ఉన్న బంధం, సంబంధం ఏంటో తెలీదు. కానీ, ఆమె పరోక్షంగా పవన్ పై ప్రేమ, కోపాన్ని చూపిస్తుంటుంది. ఇటీవలే ‘ఓ అబద్ధాలకోరు రాజకీయ నాయకుడు కాగలడు కానీ, లీడర్ మాత్రం కాలేడు’ అంటూ పూనమ్ ట్విట్ చేసిన సంగతి తెలిసిందే. పూనమ్ చేసిన ట్విట్ పవన్ ని ఉద్దేశించే అనే ప్రచారం జరిగింది. తాజాగా మరోసారి పవన్ ని గెలికింది పూనమ్. ఆదివారం విశాఖలో జనసేన నిర్వహించిన లాంగ్ రన్ పై సటైర్స్ వేసింది.
 
‘ఆగ్రహం అంటే పవర్ కాదు’ అని పూనమ్ ట్వీట్ చేసింది. ఆదివారం విశాఖ పట్నంలో జరిగిన జనసేన లాంగ్ మార్చ్  పవన్ ఉద్వేగభరింగా ప్రసంగించారు. జగన్ ప్రభుత్వానికి రెండ్రోజుల డెడ్ లైన్ విధించారు. రెండ్రోజుల్లో రాష్ట్రంలో ఇసుక సమస్యని పరిష్కరించాలని.. లేదంటే అమరావతి వీధుల్లో తాను నడుస్తానని హెచ్చరించారు. పవన్ ఉద్వేగభరిత ప్రసంగాన్ని ఉద్దేసించి పూనమ్  ‘ఆగ్రహం అంటే పవర్ కాదు’ అనే కామెంట్ పెట్టినట్టు అర్థమవుతోంది. ఈ కామెంట్ పై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ వాళ్లకి ఎంతకి అమ్ముడుపోయావ్ ? అంటూ ప్రశ్నిస్తున్నారు.