కోహ్లీ మరో డబుల్ సెంచరీ
టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగుల ప్రవాహంతో కొనసాగుతూనే ఉంది. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో విరాట్ డబుల్ సెంచరీ బాదాడు. 238 బంతులు ఆడిన కోహ్లీ… 84.45 స్ట్రైక్ రేట్ తో డబుల్ సెంచరీ చేశాడు. దీంతో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఈ సిరీస్’లో కోహ్లీకి ఇది రెండో డబుల్ సెంచరీ. అంతకు ముందు నాగ్ పూర్ టెస్టులో కూడా కోహ్లీ డబుల్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.
కోహ్లీ పరుగుల ప్రవాహంతో రికార్డులు బద్దలవుతూనే ఉన్నాయి. ఒకే సిరీస్ లో 500 పరుగులకు పైగా స్కోర్ చేసిన భారత్ బ్యాట్స్ మెన్ జాబితాలో గవాస్కర్ తరువాతి స్థానంలో నిలిచాడు. గవాస్కర్ ఒకే సిరీస్ లో 500కు పైగా పరుగులు ఆరు సార్లు సాధిస్తే.. కోహ్లీ ఆ ఘనత 3 సార్లు సాధించాడు. జీఆర్ విశ్వనాథ్, అమర్ నాథ్, రాహుల్ ద్రావిడ్ లు రెండు సార్లు ఈ ఘనత సాధించారు.
#Virat mornings wow just wow pic.twitter.com/U1mF1i4SbJ
— Varun Dhawan (@Varun_dvn) December 3, 2017