హీరోయిన్స్ కి సాయి పల్లవి పిలుపు !
హీరోయిన్స్ అంటే ఆట బొమ్మలు కాదు. మీలో ఒకరు. రియల్ ఉమెన్స్ అంటున్నారు యంగ్ హీరోయిన్ సాయి పల్లవి. స్క్రీన్‌పైన రియల్ ఉమన్‌ను చూపించాల్సిన సమయం వచ్చిందని ఆమె అభిప్రాయపడ్డారు. సాయిపల్లవి తాజాగా ‘వి ది ఉమన్’ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శరీర రంగు, ఆకారం సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి, వెండితెరపై వీటిని ఎలా చూపిస్తున్నారనే అంశాల గురించి మాట్లాడారు.
“మీరు మీరుగా ఉండండి, ఇతరుల్లోని మంచితనాన్ని గుర్తించి మెచ్చుకోండి. హీరోయిన్స్ అంటే సోషల్‌మీడియాలో చురుకుగా ఉంటూ, షాపింగ్‌మాల్స్ ప్రారంభోత్సవానికి వెళ్లడం మాత్రమే కాదు. ఓ అమ్మాయిగా ఎలా ఉండాలో తెలుసుకోవాలి, ఆత్మాభిమానంతో వ్యవహరించాలి. స్క్రీన్‌పైన రియల్ ఉమన్‌ను చూపించాల్సిన సమయం వచ్చింది” అన్నారు సాయి పల్లవి.
తెరపై కూడా సాయి పల్లవి సహజంగా కనిపిస్తారు. తక్కువ మేకప్ వేసుకొంటారు. ఎక్స్ పోజింగ్ కి ఆమె దూరం. అయినా ఆమె ప్రేక్షకులని ఫిదా చేసింది. అసలు అందం సహజత్వంలోనే ఉంది అనే టైము సాయి పల్లవి. ఇతర హీరోయిన్స్ కి ఆమె అదే చెబుతోంది. తెరపై రియల్ ఉమెన్స్ చూపిద్దామని పిలుపునిస్తోంది. ఆమె పిలుపునకు మిగితా హీరోయిన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అన్నట్టు ఇటీవల స్టార్ హీరోయిన్ కాజల్ మేకప్ లేని ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. ఇదే నా అసలైన అందమని ధైర్యంగా చెప్పిన సంగతి తెలిసిందే.