వెంకీ సినిమాలో రవితేజ

విక్టరీ వెంకటేష్ కి కథ చెప్పి ఒప్పించి అంత ఈజీ కాదని చెబుతుంటారు. అది నిజమే. ఆయనతో సినిమా అంటూ ప్రకటనలు వచ్చిన చాలామంది దర్శకుల సినిమాలు క్యాన్సిల్ అయిన సందర్భాలున్నాయి. తాజాగా వెంకీతో సినిమా చేద్దామని ట్రై చేసిన ఇద్దరు దర్శకులకి నిరాశే ఎదురైనట్టు సమాచారమ్. దర్శకుడు త్రినాథరావు నక్కిన వెంకీ కోసం ఓ కథని రెడీ చేసుకొన్నాడు. ఇందుకోసం గోవా వెళ్లి అక్కడే ఓ రెండు నెలలు కూర్చొని కథపై కసరత్తు చేశాడు. ఐతే, త్రినాథరావు కథ వెంకీకి నచ్చలేదు.

అదే కథని తీసుకెళ్లి త్రినాథరావు మాస్ మహారాజ రవితేజకి వినిపించారు. ఆయనకి కథ నచ్చింది. ఐతే, తన శైలికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేయాలని సూచించారట. ప్రస్తుతం రవితేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆ తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ సినిమా ఉండనుంది. 

ఇక వెంకీతో దర్శకుడు తరుణ్ భాస్కర్ సినిమా కూడా క్యాన్సిల్ అయినట్టు సమాచారమ్. ఫైనల్ స్క్రిప్ట్ వెంకీకి నచ్చకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలని కాదన్న వెంకీ ‘అసురన్’ రిమేక్ ని లైన్ లోకి తీసుకొచ్చారు. ఈ కథని దర్శకుడు ఓంకార్ చేతిలో పెట్టినట్టు వార్తలొస్తున్నాయ్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొత్తానికి.. వెంకీ కథతో రవితేజ సినిమా రాబోతుంది. మరీ.. రవితేజ్ మార్క్ మాస్ మసాలానా ? వెంకీ మార్క్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ నా అనేది చూడాలి.