మలైకా మనసు మారింది.. అర్జున్ తో పెళ్లికి రెడీ !
బాలీవుడ్ లో అర్జున్ కపూర్-మలైకా అరోరా బంధం గురించి తెలిసిందే. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌తో 20 ఏళ్ల క్రితం మలైకా పెళ్లైంది. వీరికి పదహారేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత మలైకా అర్జున్‌తో డేటింగ్లో ఉన్నారు. వీరిద్దరు పెళ్లి చేసుకొంటారని అందరు అనుకొన్నారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదని మలైకా, అర్జున్ కొట్టిపారేశారు. ఐతే, ఇప్పుడు మలైకా మనసు మారింది.
తాజాగా మలైకా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “అర్జున్‌ని తప్పకుండా పెళ్లి చేసుకుంటా. నా పెళ్లి ఓ డ్రీమ్‌లా ఉండాలి. పెళ్లంటూ జరిగితే కచ్చితంగా బీచ్ వద్దే జరుగుతుంది. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ ఎల్లీ సాబ్ తెలుపు రంగు గౌను వేసుకుంటాను. నా ప్రాణ స్నేహితురాళ్లు వధువు తరఫు వారిగా ఉంటారు. నా క్లోజ్ ఫ్రెండ్ వాబిజ్ మెహతా తప్పకుండా నా పక్కనే ఉండాలి. ఎందుకంటే ఆమె బెస్ట్ వుమెన్. నాకు ఫొటోలు తీయడం రాదని అర్జున్ ఫీలింగ్. అర్జున్ నా ఫొటోలు బాగా తీస్తాడు కానీ నాకు ఫొటోలు తీయడం రాదని ఎప్పుడూ తిడుతూ ఉంటాడు” అని చెప్పుకొచ్చింది.