అల.. అక్క సెంటిమెంట్ సినిమా ?


అల.. వైకుంఠపురంలో – త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో హ్యాట్రిక్ చిత్రమిది. ఇది కూడా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తరహా ఫాదర్ సెంటిమెంట్ సినిమా అన్నారు. కాదు.. మదర్ సెంటిమెంట్ సినిమా. అందుకే బాలీవుడ్ నటి టబు ని తీసుకొన్నారు. ఆమె బన్నీ అమ్మగా కనిపించబోతున్నారని చెప్పుకొన్నారు. సినిమాలో తల్లి, తండ్రి పాత్రలు బలంగా ఉంటాయనే కామెంట్స్ వినిపించాయ్.

లెటెస్ట్ న్యూస్ ఏంటంటే ? అల.. వైకుంఠపురంలో అక్క సెంటిమెంట్ తో తెరకెక్కుతోంది. ఇందులో టబు బన్నీకి అక్కగా కనిపించనున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఓ హైక్లాస్ ఇంటికి టబు వెళ్తుంది. అలా ఆ ఇంటికి వెళ్లిన టబుకు ఎదురైన సంగటనలు ఏంటి ? వాటిని బన్నీ ఎలా పరిష్కరించాడు అన్నది కథ అని తెలుస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే టబు ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఇందులో ఆమె యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. దీంతో అల.. అక్క సెంటిమెంట్ సినిమా అనడానికి మరింత బలం చేకూరుతోంది.

ఈ చిత్రంలో బన్నీకి జంటగా పూజా హెగ్డే నటిస్తున్నారు. నభా నటాషా మరో హీరోయిన్. యంగ్ హీరోలు నవదీప్, సుశాంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు సాంగ్స్ సామజవరగమన, రాములో రాముల సూపర్ హిట్టయ్యాయి. గీతా ఆర్ట్స్, హారిక & హాసినీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న అల.. ప్రేక్షకుల ముందుకు రానుంది.