మహేష్ బాబుకు జెడ్ సెక్యూరిటీ !
సూపర్ స్టార్ మహేష్ బాబుకు బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ అందించింది కేంద్ర ప్రభుత్వం. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఇందులో మహేష్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. దానికి సంబంధించిన సన్నివేశాలని కాశ్మీర్ లో నిర్వహించిన తొలి షెడ్యూల్ లోనే చిత్రీకరించారు. పహల్‌గామ్‌లో కొన్ని రోజులు, శ్రీనగర్‌లో మరికొన్నిరోజులు షూటింగ్ చేశారు.
అక్కడ షూటింగ్ చేసుకోవడానికి అనుపతి.. అంత ఈజీగా దొరకలేదు. చాలా కష్టపడ్డారు. కేంద్రమంత్రి రాజనాథ్ సింగ్ హెల్ప్ తీసుకుంది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రబృందం. ఆయన రికమండేషన్ చేస్తే పర్మిషన్ వచ్చింది. అదికూడా ఎర్లీ మార్నింగ్ 5 నుండి 10 వరకు మాత్రమే షూటింగ్ చేసుకోవడానికి అనుమతినిచ్చారు. అంతేకాదు.. మహేష్ కి బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ అందించారు. హోటల్ నుండి షూటింగ్ లొకేషన్ కి చేరుకోవడానికి, మహేష్ కోసం బుల్లెట్ ప్రూఫ్ సెక్యూరిటీ అప్లై చేశారు నిర్మాతలు. కాశ్మీర్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని తిరిగొచ్చిన మరుసటి రోజే జమ్ముకశ్మీర్ లో 370 ఆర్టికల్ రద్దు చేస్తున్నట్టు కేంద్రప్రభుత్వం ప్రకటించింది.