రానాతో ఆ పని చేయలేదు : రకుల్


హీరో రానా దగ్గుపాటితో లింకుపెట్టి బాగా ప్రచారం జరిగిన హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. వీరిద్దరు కలసి ఒక్క సినిమాలోనూ నటించలేదు. కానీ, వీరిద్దరు డేటింగ్ లో ఉన్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. రకుల్ కోసం రానా రికమెండేషన్స్ చేశాడని.. ఆమె వేగంగా స్టార్ హీరోయిన్ అవ్వడం వెనక రానా కృషి ఉండని చెప్పుకొంటుంటారు. వీరిద్దరు కలసి ఫారిన్ టూర్స్ వెళ్లాచారనే గాసిప్ కూడా ఉంది. ఇటీవల ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా బంధం గురించి స్పందించింది రకుల్.

“తాను ఎవరితోనూ డేటింగ్ లో లేను. నా ఇల్లు, రానా ఇల్లు పక్కపక్కనే. మంచు లక్ష్మి నాకు మంచి స్నేహితురాలు. అలాగే రానా కూడా క్లోజ్ ఫ్రెండ్. లక్ష్మి, నేను, రానా.. ఇలా మా ఫ్రెండ్స్ గ్యాంగ్ లో చాలా మంది ఉన్నారు. మేమంతా చాలా స్నేహంగా ఉంటాం. నా సినీ కెరీర్ ప్రారంభమైనప్పటి నుంచి రానా నాకు తెలుసు. అయినా నాకు ప్రేమించేంత సమయం లేదు. వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నాను. నేను సింగిల్” అని చెప్పుకొచ్చింది రకుల్.

ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది రకుల్. దే దే ప్యార్ సినిమాతో బాలీవుడ్ లో తొలి విజయాన్ని అందుకొంది. ఈ సమయంలో బ్రా అందాలతో బాలీవుడ్ ప్రేక్షకులని ఫిదా చేసింది. ఆమె తాజా బాలీవుడ్ చిత్రానికి సంబంధించిన ఓ ప్రత్యేక గీతానికి సంబంధించిన లుక్ ఇటీవలే బయటికొచ్చి వైరల్ అయిన సంగతి తెలిసిందే.