జగన్’కు పవన్ హెచ్చరిక

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సత్తా ఏంటన్నది తేలిపోయింది. ఏపీలో కింగ్ మేకర్ అవుతారని భావించిన పవన్.. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపారు. ఐతే, ఓటమితో కుంగిపోకుండా.. కేవలం 15నిమిషాల్లోనే పరాజయం నుంచి బయయపడిన జగన్ ప్రభుత్వంపై పోరాటం మొదలెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇసుక కొరతపై ఆయన ప్రభుత్వాన్ని గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీలో పలు అంశాలపై పవన్ తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. రాజధాని మార్పుపై స్పందించిన పవన్ రాజధానిని పులివెందులకు మార్చులని సటైర్ వేశాడు.

విశాఖ జిల్లా గాజువాకలో కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు పవన్ సీఎం జగన్ కి హెచ్చరికలు చేశారు. తమపై అక్రమంగా బనాయించిన కేసులను వెనక్కి తీసుకోకుంటే తమ సత్తా చూపిస్తామన్నారు. గాజువాకను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే అంబటి రాంబాబు అదుపు తప్పి మాట్లాడటం సరికాదన్నారు. వివేకా హత్య, కోడికత్తి కేసులు వైకాపాపై వేలాడుతున్నాయని పవన్ అన్నారు.