డెడ్ లైన్ ముగిసింది.. కేసీఆర్ రియక్షన్ ఏంటీ ?


‘నవంబర్ 5 అర్థరాత్రి’ డెడ్ లైన్ ముగిసింది. ఈలోగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలి. లేదంటే వారి ఉద్యోగాలు పోయినట్టే. అసలు తెలంగాణలో ఆర్టీసీ కథ ముగిసినట్టే. ఆర్టీసీ లేని రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం కూడా చేరుతుందని సీఎం కేసీఆర్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ డెడ్ లైన్ ని ఆర్టీసీ కార్మికులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఐక్యత చాటుతూ తెలంగాణలో మరోసారి ఉద్యమ స్పూర్తిని చూపించారు. మరీ.. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఏం చేయబోతున్నారు.

ముందుగానే హెచ్చరించినట్టు.. ఆర్టీసీని పూర్తిగా ప్రయివేటు పరం చేయనున్నారు. ఇందుకు ఏమైనా న్యాయపరమైన చిక్కులు వస్తాయా ? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు, ఆర్టీసీని ప్రయివేటు పరం చేయడం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో లేదు. దానికి తప్పనిసరిగా కేంద్రం అనుమతిని తీసుకోవాలి. తెలంగాణ ఆర్టీసీలో కేంద్రానికి 30శాతం వాటా ఉందని ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు.. తమకి కేంద్రంలో అధికారంలో ఉన్న భాజాపా అండదండలు బలంగా ఉన్నాయని చెప్పుకొంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ భవితవ్యం ఏం కానుంది. సీఎం కేసీఆర్ రియాక్షన్ ఏంటీ ? అన్నది హాట్ టాపిక్ గా మారింది.